14, నవంబర్ 2009, శనివారం

Nenu Saitham....

అమ్మ గోరుముద్దలు...
నాన్న మందలింపులు...
స్నేహితులతో ఆటలు...
బళ్ళో టీచరు పాటాలు...
 ఇదే మనకు తెలిసిన బాల్యం!!

కార్పోరేట్ కళాశాలలు...
ర్యాంకుల ఆరాటాలు...
దోస్తులతో షికార్లు...
క్యాంపస్ ఉద్యోగాలు...
ఇదే మనకు తెలిసిన యవ్వనం!!

ఎలా గడిచిందో తెలీని బాల్యం...
ఎపుడువచ్చి వెళ్లిందో తెలీని యవ్వనం...
కంప్యుటర్లల ముందు ప్రాణమున్న యంత్రాలను చేసే ఉద్యోగం...
మనకూ స్పందించే మనసొకటూందాని మరచిన మనం...
ఇదేనా మన జీవితం!!
ఇంతేనా దీనికి అర్ధం!!!

ఒక్క క్షణం ఆలోచించండి...
     మీ చూపులను కార్పొరేట్ హంగుల నుండి...
                                కారుణ్యం వైపుకు మరల్చండి!!!

అమ్మానాన్నల ప్రేమకు నోచుకోని ఎన్నో హృదయాలు...
మనలని గుచ్చి అడుగుతున్నాయి... "అన్నా!! మా అమ్మానాన్నలు ఏరని??"

ఆటపాటలతో ఆనందంగాగడపాల్సిన  పసిమనసులు...
మనలని సూటిగా ప్రశ్నిస్తున్నాయి..."అన్నా!! మేమెందుకు మీల లేమని??"

    ఎవరిని నిందిద్దాం!
    ఇంకేవారిని కారణంగా చూపిద్దాం!!
         వారికిలాంటి జన్మలనిచ్చిన తల్లిదండ్రులనా...
         ఈ జగన్నాటకంలో వారి పాత్రలను అస్తవ్యస్తంచేసిన విధాతనా...
         వారికీ దుస్థితిని మిగిల్చిన పరిస్థితులనా...
లేక....
          పరిస్థితులను కారణంగా చూపి పక్కకుతప్పుకుంటున్న మనలనా????
           ఎవరిని నిందిద్దాం!!
          మరేవారిని కారణంగా చూపిద్దాం!!
ఒకరినొకరు నిందిన్చుకొనేబదులు...
               మనవంతుగా మనం ముందుకడుగేద్దాం...
              వారిని చేరదీద్దాం....
              వారికో జీవితన్నిద్దాం!!! 
 
దీని కోసం మనం మన జీతాలను జీవితాలను త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు...
మన అనవసర ఖర్చులతో వారి అవసరాలను తీరుద్దాం!!
వారిని మనలాగా ...
  మనలాగా కాకపోయినా...
  కనీసం మౌలిక అవసరాలతో బ్రతకనిద్దాం!!
                                వారికో బ్రతుకునిద్దాం!!!
చేయి చేయి కలుపుదాం !
వారికి చేయుతనిద్దాం!!
 "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను "
       - అన్న శ్రీశ్రీ గారి కలలకు వరసులమౌదాం!!
        వారి బంగారుభావితకు వారదులమౌదాం!!

ఒక్కక్షణం ఆలోచిద్దాం!!
ఒక నిండు జీవితాన్ని నిలుపుదాం!!
ప్రేమను నోచుకోని హృదయాలకు...
   ఆప్యాయతను పంచుదాం!!!
                                                        మన్ను.యస్ 

1 కామెంట్‌: