30, నవంబర్ 2009, సోమవారం

అభిమానం...

అభిమానం...ఈ పదం పెదాల మధ్య నలిగినప్పుడల్లా ఏవో ద్రుశ్యాలు సినిమా ఫక్కీలో రీళ్ళలా కళ్ళముందు కదలాడుతూ వుంటయి. కొన్నిసార్లెమో పవన్ కల్యాణ్ సినిమా బెనెఫిట్ షో కోసం వేలరూపాయలుగా   మారుతుంటయ్...మరికొన్నిసార్లైతె జనహ్రుదయనేతకు ప్రాణత్యాగాలరూపంలో నివాళులర్పిస్తుంటయ్!! టిక్కెట్టుగా  మారిన ప్రతిరూపాయి , ఆధారం కోల్పొయిన ప్రతిగడప ప్రశ్నిస్తూనేవుంటుంది "అభిమానం అంటె ఇదేనా అని..." వెక్కిరిస్తూనెవుంటుంది.... "వేలంవెర్రిగ మారిన వీరాభిమానాన్నిచూసి..."!!!   ఇలా ఎవేవో పిచ్చిఆలోచనలతో మైత్రీవనంలో తిరుగుతూ...వేడెక్కిన బుర్రకు వేడుకను చూపేందుకు అమీరుపేట సత్యం హాలుకుబయలుదేరాను... అసలేవేడెక్కిన నాబుర్ర బారులుతీరిన క్యూలనుచూసి కరెంటుషాకు కొట్టిన కాకిలా అరవసాగింది!! తప్పక మనసొప్పక ..కాదు కాదు.. గంటల కొద్దీ క్యూకట్టే ఓపికలేక నిన్నమొన్ననే పరుసు బరువు పెంచిన జీతం... బ్లాకుటిక్కెట్టుకు ప్రోత్సహించాయి!! ఇక ఎలనొ టిక్కెట్టు చేతికొచ్చింది కదాఅని..భారమైన నా ఒంటరితనాన్ని తోటిప్రేక్షకులమీదకు ఎక్కుపెట్టా!! పెద్దపండక్కు అత్తరింటికి వచ్చిన కొత్తపెళ్ళికొడుకులా టిక్కెట్టుల్లివ్వక ముచ్చటలేస్తూ బెట్టుచేస్తున్న టిక్కెట్టుకౌంటరోడితో కాసేపు... వేసవి విడిదికి కొల్లేటిసరస్సునుచేరిన పక్షుల్లా తమను ఎవరైనా గమనిస్తారెమోనని ఒదిగిపొయి నక్కి నక్కి  చూస్తున్న ప్రేమజంటలతో కాసెపు నా ఒంటరితనాన్నిపంచుకున్నాను!!  ఇలా నాకు తెలీకుండానే కాలం దొరిలిపొయిండి... సినిమా అయిపోయిందీ!! ఇక అలొచించే ఒపికలేక... చేసేపనేమిలేక.... మైత్రీవనమ్నుండి  ఒక షేర్డ్ ఆటొ పట్టుకుని రూముదారి (హైటెక్కుసిటీ)పట్టాను!! పవన్ కల్యాణ్ జల్సా సాంగుతో పాటుగ ఆటోకూడా స్పీడులంకించుకుంది!! ........................................ ఒక్క సారిగా  ఆటోడ్రైవరు వేసిన బ్రేకుతో అందరం పాటల్లోనుండి ఆటోలోకొచ్చాం!! డ్రైవరును చెడామడా తిడదామని తిట్లన్ని గుర్తుచేసుకుంటుండగా... మమ్మల్ని పట్టించుకోకుండా డ్రైవరెళ్ళి కాళ్ళు లేక కష్టంతో రోడ్డుదాటలేక ఇబ్బందిపదుతున్న ఒక అతన్ని రోడ్డుదాటించి..తీసుకొచ్చి ఆటొలొ తనపక్కనె కూర్చొబెట్టుకొని....మళ్ళీ ఆటో డ్రైవింగ్లో తను...పాటల్లో మేము మునిగిపొయ్యాము...కొద్దిదూరం వెళ్ళాక (యుసుఫ్ గుడ దగ్గరలో) అతను దిగిపోబోతు... ఆటో ఫేర్ ఇచ్చడు..ఆటో డ్రైవరేమో వద్దన్నాడు!! దానికి అతను....  ఇచ్చిన సమాధానం అందరి మనసుల్ని తాకింది!! అదేంటంటే " తనను అందరిల చూస్తే చాలు...సానుభూతి జాలి వద్దని" !!!  వెంతనె మళ్ళి నా ప్రశ్న గుర్తుకు వచ్చింది..." అబిమానం అంటే ఏంటని"?? ......................................................... మళ్ళీ నాకు బాగ అర్ధమయ్యె సినిమా ఫక్కిలో రీళ్ళు కదలడం ఆరంభించయి!!..................... డ్రైవర్ రిస్కుతో వేసినబ్రేకు...... తననుంది డబ్బును ఆశించకుండ రోడ్డు దాటే వరకు ఆగి తనను ఏక్కించుకోవడం..... డబ్బులు వద్దన్న డ్రైవరునుంది సానుభూతిని ఆసించకుండ..తనది అంగవైకల్యమే కాని అభిమానవైకల్యంకాదన్న ఆ తోటి ప్రయణికుడు..... ......................................................................................................................................"""!!!!  అప్పుడనిపించింది .... అభిమానం అంటే రూపాయలుగా మారిన టిక్కెట్టులు కాదని... ప్రాణాలను నివాళులను చేయడం కాదని...  అభిమానం అంటే... "సానుభూతిమీద కాదు స్వాభిమానంతో బతకడం .... సమాజాన్ని ప్రేమించగలిగే సామాజికాభిమానం...."
     -----మొత్తనికి నా ప్రశ్నకు సమధానం దొరికింది!!!    "స్వాభిమానం తో... సామాజికాభిమానంతో...."