30, నవంబర్ 2009, సోమవారం

అభిమానం...

అభిమానం...ఈ పదం పెదాల మధ్య నలిగినప్పుడల్లా ఏవో ద్రుశ్యాలు సినిమా ఫక్కీలో రీళ్ళలా కళ్ళముందు కదలాడుతూ వుంటయి. కొన్నిసార్లెమో పవన్ కల్యాణ్ సినిమా బెనెఫిట్ షో కోసం వేలరూపాయలుగా   మారుతుంటయ్...మరికొన్నిసార్లైతె జనహ్రుదయనేతకు ప్రాణత్యాగాలరూపంలో నివాళులర్పిస్తుంటయ్!! టిక్కెట్టుగా  మారిన ప్రతిరూపాయి , ఆధారం కోల్పొయిన ప్రతిగడప ప్రశ్నిస్తూనేవుంటుంది "అభిమానం అంటె ఇదేనా అని..." వెక్కిరిస్తూనెవుంటుంది.... "వేలంవెర్రిగ మారిన వీరాభిమానాన్నిచూసి..."!!!   ఇలా ఎవేవో పిచ్చిఆలోచనలతో మైత్రీవనంలో తిరుగుతూ...వేడెక్కిన బుర్రకు వేడుకను చూపేందుకు అమీరుపేట సత్యం హాలుకుబయలుదేరాను... అసలేవేడెక్కిన నాబుర్ర బారులుతీరిన క్యూలనుచూసి కరెంటుషాకు కొట్టిన కాకిలా అరవసాగింది!! తప్పక మనసొప్పక ..కాదు కాదు.. గంటల కొద్దీ క్యూకట్టే ఓపికలేక నిన్నమొన్ననే పరుసు బరువు పెంచిన జీతం... బ్లాకుటిక్కెట్టుకు ప్రోత్సహించాయి!! ఇక ఎలనొ టిక్కెట్టు చేతికొచ్చింది కదాఅని..భారమైన నా ఒంటరితనాన్ని తోటిప్రేక్షకులమీదకు ఎక్కుపెట్టా!! పెద్దపండక్కు అత్తరింటికి వచ్చిన కొత్తపెళ్ళికొడుకులా టిక్కెట్టుల్లివ్వక ముచ్చటలేస్తూ బెట్టుచేస్తున్న టిక్కెట్టుకౌంటరోడితో కాసేపు... వేసవి విడిదికి కొల్లేటిసరస్సునుచేరిన పక్షుల్లా తమను ఎవరైనా గమనిస్తారెమోనని ఒదిగిపొయి నక్కి నక్కి  చూస్తున్న ప్రేమజంటలతో కాసెపు నా ఒంటరితనాన్నిపంచుకున్నాను!!  ఇలా నాకు తెలీకుండానే కాలం దొరిలిపొయిండి... సినిమా అయిపోయిందీ!! ఇక అలొచించే ఒపికలేక... చేసేపనేమిలేక.... మైత్రీవనమ్నుండి  ఒక షేర్డ్ ఆటొ పట్టుకుని రూముదారి (హైటెక్కుసిటీ)పట్టాను!! పవన్ కల్యాణ్ జల్సా సాంగుతో పాటుగ ఆటోకూడా స్పీడులంకించుకుంది!! ........................................ ఒక్క సారిగా  ఆటోడ్రైవరు వేసిన బ్రేకుతో అందరం పాటల్లోనుండి ఆటోలోకొచ్చాం!! డ్రైవరును చెడామడా తిడదామని తిట్లన్ని గుర్తుచేసుకుంటుండగా... మమ్మల్ని పట్టించుకోకుండా డ్రైవరెళ్ళి కాళ్ళు లేక కష్టంతో రోడ్డుదాటలేక ఇబ్బందిపదుతున్న ఒక అతన్ని రోడ్డుదాటించి..తీసుకొచ్చి ఆటొలొ తనపక్కనె కూర్చొబెట్టుకొని....మళ్ళీ ఆటో డ్రైవింగ్లో తను...పాటల్లో మేము మునిగిపొయ్యాము...కొద్దిదూరం వెళ్ళాక (యుసుఫ్ గుడ దగ్గరలో) అతను దిగిపోబోతు... ఆటో ఫేర్ ఇచ్చడు..ఆటో డ్రైవరేమో వద్దన్నాడు!! దానికి అతను....  ఇచ్చిన సమాధానం అందరి మనసుల్ని తాకింది!! అదేంటంటే " తనను అందరిల చూస్తే చాలు...సానుభూతి జాలి వద్దని" !!!  వెంతనె మళ్ళి నా ప్రశ్న గుర్తుకు వచ్చింది..." అబిమానం అంటే ఏంటని"?? ......................................................... మళ్ళీ నాకు బాగ అర్ధమయ్యె సినిమా ఫక్కిలో రీళ్ళు కదలడం ఆరంభించయి!!..................... డ్రైవర్ రిస్కుతో వేసినబ్రేకు...... తననుంది డబ్బును ఆశించకుండ రోడ్డు దాటే వరకు ఆగి తనను ఏక్కించుకోవడం..... డబ్బులు వద్దన్న డ్రైవరునుంది సానుభూతిని ఆసించకుండ..తనది అంగవైకల్యమే కాని అభిమానవైకల్యంకాదన్న ఆ తోటి ప్రయణికుడు..... ......................................................................................................................................"""!!!!  అప్పుడనిపించింది .... అభిమానం అంటే రూపాయలుగా మారిన టిక్కెట్టులు కాదని... ప్రాణాలను నివాళులను చేయడం కాదని...  అభిమానం అంటే... "సానుభూతిమీద కాదు స్వాభిమానంతో బతకడం .... సమాజాన్ని ప్రేమించగలిగే సామాజికాభిమానం...."
     -----మొత్తనికి నా ప్రశ్నకు సమధానం దొరికింది!!!    "స్వాభిమానం తో... సామాజికాభిమానంతో...."            

25, నవంబర్ 2009, బుధవారం

నేను

నేనెవరినని...
ఎవరికిఏమౌతానని...
ఇలాచాలాసార్లు ప్రశ్నించుకున్నాను నామదిని...
కనీసం అదైనా ఏదోనాడుసమధానమివ్వకపోతుందానని...
పాపం...
అదికూడాచేసిందిఎన్నో విఫలయత్నాలను!
చివరకు తేల్చింది దయచేసి తనను వదిలేయమని!!  
ఇంతకూ...
నేనెవరినని...
ఎవరికిఏమౌతానని...
ఈప్రశ్నను అసలు ఎవరిని అడగాలని...
విసిగి విసిగి వేసారి...
   చివరకు నన్ను నేనుగా ఆవిష్కరించుకొనేందుకు ఈచిన్న ప్రయత్నాన్ని ఆరంభించాను...  
నేను...
 శూన్యంలోకి చూస్తు పిచ్చిలెక్కలేవోవెసుకొని మురిసిపోయే...
                                                                 గణాంక కోవిదుడ్నినేను!!
 మహాభారత రామయణాలలో ఎదిగొప్పో నెగ్గుతెల్చేందుకు...
      మిత్రుడు రవికాంతునితో ఇష్టాగొష్టిలుజరిపిన పేద్ధ సాహితివెత్తను నేను !!
స్త్రీ స్వేచ్చాస్వాతంత్రాలను హరించే పురుషజత్యాహంకరం మీద...
             యాసిడ్ దాడులనుచెయ్యాలనుకొనే ఉన్మాదిని నేను!!
చర్చలకేమీ అందనపుడు ఆడదానికట్టూబొట్టుల గురించి...
             గంటలకొద్దీ విమర్శించే సగటు మగాడిని నేను!!

శంకర్ దాదా సినిమాను చూసి...
             కనీసం ఒక్క సెకెనైనా గాంధీలా బతకాలనుకొనే అసలైన గాంధేయవాదిని నేను!!
నేను ముస్లీం ననగానె ఇబ్బందిగాచూసిన చూపులకు ఎలా సమాధానమివ్వాలో తెలీక
 నిత్యం హనుమంతుడిగుడిముందు నా గుండెగోడునువెల్లిబుచ్చుకొనే భారతీయుడిని నేను!!
ఈప్రపంచాన ఆకలిదప్పులచావులనేవి వుండకూడదని...
      రొజులకొద్దీ ప్రణాళికలు వేసె స్వయంప్రాతిపత్తికా ప్రణాళికాసంఘన్ని నేను!!
కంప్యుటర్ యంత్రలముందు మొకరిల్లి...
     జీవితపు సున్నితత్వాన్ని కొల్పోతున్న యాంత్రికుడిని నేను!!
వారానికి మూణ్ణలుగుసార్లు కొళ్ళనుమేకలను నములుతూ...
     జీవహింస గురించి లెక్చర్లుదంచే గొప్ప అహింసావాదిని నేను!!
కలెక్టరునై  జనాన్నిఉద్ధరించడమె  నా జీవితలక్ష్యంగ చెసుకోని...
     మావూరి ఎమ్మర్వో గారి పైరాబడి గురించి ఆరాలుతీసే దీనజనోద్ధారకుడిని నేను!!  
మీటరు ఆటోల్లో, ఆఫీసు క్యాబుల్లో కూర్చోని...
      బస్సుల్లో ఫూట్ బొర్డింగ్ ఎంతప్రమదమోనని ఆలోచించే మేధావిని నేను!!
ఇంకా చెప్పలంటే... 
   కొన్నిసార్లు కవితలామారి...
           పిడిబాకుపదలతో విప్లవజ్యోతుల్ని వెలిగిస్తుంటాను!!
  మరికొన్నిసార్లెమో సమిధలా మారి...
           శ్రీశ్రిగారి కలలకు వారసుణ్ణై మురిసిపోతుంటాను!!
   ఇంకొన్నిసార్లైతే ఏకంగా ఉవ్వెత్తున ఎగిసేప్రవాహాన్నై...
           సామాజిక అసమనతలను రూపుమాపి సోషలిస్టు జలాలను నలుమూలలా ప్రవహింపచెస్తుంటాను!!
    ఇక ... ఎన్నో సార్లు పెనుతుఫానునై...
          పేదగొప్పతారతమ్యాలను పేకటివేళ్ళతో పెకిళించేస్తుంటాను!!
                                                                                                                            ----Mannu.S

14, నవంబర్ 2009, శనివారం

Nenu Saitham....

అమ్మ గోరుముద్దలు...
నాన్న మందలింపులు...
స్నేహితులతో ఆటలు...
బళ్ళో టీచరు పాటాలు...
 ఇదే మనకు తెలిసిన బాల్యం!!

కార్పోరేట్ కళాశాలలు...
ర్యాంకుల ఆరాటాలు...
దోస్తులతో షికార్లు...
క్యాంపస్ ఉద్యోగాలు...
ఇదే మనకు తెలిసిన యవ్వనం!!

ఎలా గడిచిందో తెలీని బాల్యం...
ఎపుడువచ్చి వెళ్లిందో తెలీని యవ్వనం...
కంప్యుటర్లల ముందు ప్రాణమున్న యంత్రాలను చేసే ఉద్యోగం...
మనకూ స్పందించే మనసొకటూందాని మరచిన మనం...
ఇదేనా మన జీవితం!!
ఇంతేనా దీనికి అర్ధం!!!

ఒక్క క్షణం ఆలోచించండి...
     మీ చూపులను కార్పొరేట్ హంగుల నుండి...
                                కారుణ్యం వైపుకు మరల్చండి!!!

అమ్మానాన్నల ప్రేమకు నోచుకోని ఎన్నో హృదయాలు...
మనలని గుచ్చి అడుగుతున్నాయి... "అన్నా!! మా అమ్మానాన్నలు ఏరని??"

ఆటపాటలతో ఆనందంగాగడపాల్సిన  పసిమనసులు...
మనలని సూటిగా ప్రశ్నిస్తున్నాయి..."అన్నా!! మేమెందుకు మీల లేమని??"

    ఎవరిని నిందిద్దాం!
    ఇంకేవారిని కారణంగా చూపిద్దాం!!
         వారికిలాంటి జన్మలనిచ్చిన తల్లిదండ్రులనా...
         ఈ జగన్నాటకంలో వారి పాత్రలను అస్తవ్యస్తంచేసిన విధాతనా...
         వారికీ దుస్థితిని మిగిల్చిన పరిస్థితులనా...
లేక....
          పరిస్థితులను కారణంగా చూపి పక్కకుతప్పుకుంటున్న మనలనా????
           ఎవరిని నిందిద్దాం!!
          మరేవారిని కారణంగా చూపిద్దాం!!
ఒకరినొకరు నిందిన్చుకొనేబదులు...
               మనవంతుగా మనం ముందుకడుగేద్దాం...
              వారిని చేరదీద్దాం....
              వారికో జీవితన్నిద్దాం!!! 
 
దీని కోసం మనం మన జీతాలను జీవితాలను త్యాగం చెయ్యాల్సిన అవసరం లేదు...
మన అనవసర ఖర్చులతో వారి అవసరాలను తీరుద్దాం!!
వారిని మనలాగా ...
  మనలాగా కాకపోయినా...
  కనీసం మౌలిక అవసరాలతో బ్రతకనిద్దాం!!
                                వారికో బ్రతుకునిద్దాం!!!
చేయి చేయి కలుపుదాం !
వారికి చేయుతనిద్దాం!!
 "నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను "
       - అన్న శ్రీశ్రీ గారి కలలకు వరసులమౌదాం!!
        వారి బంగారుభావితకు వారదులమౌదాం!!

ఒక్కక్షణం ఆలోచిద్దాం!!
ఒక నిండు జీవితాన్ని నిలుపుదాం!!
ప్రేమను నోచుకోని హృదయాలకు...
   ఆప్యాయతను పంచుదాం!!!
                                                        మన్ను.యస్ 

Kaanu nenu Vijethanu,,,

చేయలేకపోతున్నాను ఒంటరి ప్రయాణం...
వీడలేకపోతున్నాను తన ప్రేమ భావం...
బ్రతకలేకపోయాను యాంత్రికంగా నేను...
మరువేలేకున్నాను తన గురుతులను...
           సాధించినవి ఎన్నో...
           నను విజేతగా మలచినవి మరెన్నో...
కాని....
         కాను నేను విజేతను...
                         తన ప్రేమను పొందలేనినాడు!!
         మరి కాను నేను విజేతను...
                        తన ప్రేమ మాధుర్యాన్ని చవిచూడని నాడు!!
        ఇక కాలేను విజేతను...
              నా జీవితాన తన గురుతులనేవి లేని నాడు!!!
                          ఎప్పటికైనా నీప్రేమను పొందాలన్న ఆశతో...
                                                                నీ
                                                                   మన్ను.యస్

13, నవంబర్ 2009, శుక్రవారం

ఇప్పటికి అదే అనిశ్చితి...
తనను ఫలాన అని చెప్పలేని స్థితి..
ఎల్లవేళలా తనచుట్టే పరిభ్రమించే నా మది...
పదాలు పేర్చలేని ఓ అనిర్వచనీయ అనుభూతి...
మైకమో..
మరి లేక మోహమో..
నాకైతే తెలీదు తనపై నాకెందుకింత వ్యామోహమో???

తనను
 చూసినప్పుడల్లా ఏదో మాటడమంటుంది నా మది..
కాని
   ఏమి మాట్లాడాలో తెలీక...
   అసలు మాట్లాడటానికి ఏమీ లేక...
   
అలానే చూస్తూ వుంటాను తనను...
దూరంగా వెళ్ళాక నా వైపుగా విసిరే తన దొంగ చూపును!!!

ఇప్పటికీ అదే అనిశ్చితి!!
తనను నాదిగా చెప్పలేని స్థితి!!!
                                                             నీ
                                                                 మన్ను.యస్

10, నవంబర్ 2009, మంగళవారం

oa sayam sandhyana...

చందమామ కలువలను నిద్రనుండి మేల్కొల్పువేళ...
ఉదయభానుని అరుణకిరణాలు తుదిమెరుగులు దిద్దుకుంతున్నవేళ...
పండిన ఎర్రని గోరింటవోలె...
నులివెచ్చని కౌగిలిలో బిగిసిన పడతి మొమువోలె...
ఆకసము రూపుదాల్చువేళ ...
విహగాల సురాగాల తాకిడికి తనువు మధువై పులకించు వేళ...
అరుదైన ఆ సాయం సంధ్యా సమయాన...
                            ప్రియా.......
                                 బరువెక్కిన శ్వాసతో...
                                 యద నిండా ఆశలతో...
                                  నీ బిగి కౌగిలిలో కరిగిపోవాలని...
ఆకసమంటి నీ విశాల నుదిటిపై...
                   చంద్రబింబమంటి కుంకుమతిలకాన్నై వెలగాలని!!!
చెమ్మనెన్నడు చూడని నీ కనులలో...
                                   కనుపాపలా మెలగాలని!!!
పిల్ల తెమ్మరలకు ఎగిసే నీ కురులలో...
                       సిరిమల్లినై వోదిగిపోవాలని!!!

            జన్మ జన్మలకు నీ మనసులోనే కొలవుండిపోవాలని....
                                         నీ ప్రియుని ఆవేదనను అలకింపుమా....
                                                                               ఓ నా ప్రియతమా !!!
                                             నీ ప్రేమలో....
                                                   మన్ను.యస్

Nuvvu... Nee chiru navvu!!!

దాటానేన్నో తీరాలు...
చేరనేన్నో సుదూరాలు...
కాని...
          నను వీడవు నీ జ్ఞాపకాలు!!
నీ జ్ఞాపకాలే పురాతనం...
నను వెంబడించెను ప్రతీక్షణం!!
లోకాన ఉదయించేది  ఒకే చంద్రబింబం!
నా ఈ మనసున వికసించేది ఒకటే రూపం!!
                అదే ....
                         నువ్వు!
                       నీ చిరునవ్వు!!
                                               నీ ప్రేమలో..   
                                                      మన్ను.యస్   

sadaa nee premalo...

ఎపుడైతే నీ రాకకై నా కనులు వీక్షించాయో ...
ఎపుడైతే నీ పలకరింపుతో నా యద పులకరించిందో...
అపుడే తెలిసింది...
      నువ్వంటే నా కిష్టమని!
      నా యదలో వుంది నీ రూపమని!!

కాని...
      నా పెదవి దాటిరాకుంది ఆ మాట!
      నీ మదిని చేరకుంది నా బాస!!

      ఏదో సంశయం!!
      కాదంటవేమోనన్న భయం!!
      గుండెనువీడని ఒక అనిర్వచనీయ అనుభవం!!
     ఒకటి మాత్రం నిజం...
                  ఇలాంటి భావమే వస్తంది ఎదోనాడు నీ మదిలో కూడా!!
                   నాటివరకు వేచివుంటా ప్రియా నీ కొరకై...
                                                    ఎన్నాళ్ళైనా...
                                                    ఎన్నేళ్ళైనా...
                                                          సదా నీ ప్రేమకై తపించే..
                                                                        నీ మన్ను.యస్ 
  

naa hrudayam...

మేఘాలను చూడక చాలా రోజులైంది కాబోలు...
        నోరు తెరుచుకుంది ఆకాశం!
                                "ఓపిక లేని నా హృదయం లాగ"!!!
                                                                      మన్ను.యస్

9, నవంబర్ 2009, సోమవారం

Amma

అమ్మ!
     సృష్టిలోని అందమైన పదం !!
     సృష్టిలోని అందాన్నంతా ఒక కుప్పగా పోస్తే ...
          అందులో అణువణువు నే అమ్మతో గడిపిన క్షణాలే!!

     అందమంటే ఏమిటో చెప్పమంటే ...
     అందానికి అమ్మ కన్నా అందమయిన పేరు వేరే ఏముంటుంది??

                నే గోముగా గోరుముద్దలు తిన్నప్పుడు ...
                నే ముద్దుగా తప్పటడుగులు వేస్తున్నప్పుడు ...
                నా చిట్టి చేతులతో తన చెంపలను నిమురుతున్నప్పుడు ...
                నా చిన్నారి పాదాలతో తన గుండెల మీద తన్తున్నప్పుడు ....
                తన కళ్ళలోని ఆనందం !!!నిజమైన అందం!!!

                 పిల్లితో పోటిపడి పాలు తాగుతున్నప్పుడు...
                 తోటి పిల్లలకు దీటుగా పరీక్షలు రాస్తున్నప్పుడు...   
                 క్లాసు కబుర్లన్నీ తనకు గుచ్చిగుచ్చి వివరిస్తున్నప్పుడు...
                 నాన్నపై భయాన్ని కోపంగా ప్రదర్శిస్తున్నప్పుడు...
                 తను నాపై కురిపించే ఆప్యాయత!!! అందం!!!

                 స్నేహితులతో కలిసి షికార్లలో మునిగితేలుతున్నప్పుడు...
                 నాన్న మందలింపును లక్ష్యపెట్టనప్పుడు...
                 తన బుజ్జగింపుకు సైతం లొంగనపుడు...
                 లోకమంత రంగుల హరివిల్లని భ్రమపడుతున్నప్పుడు ...
                 తన మదిలొ మెదిలే ఆందోళన !!! అందం!!!

                 అనుక్షణం తను నా కోసం పరితపించే...
                                        తన అనురాగం అందం!!!
                 ప్రతిక్షణం తను చేసే ...
                                        తన ఆలోచన అందం!!!
                 నా ఇష్టాలను తన ఇష్టాలుగా మలచుకొన్న...
                                         తన త్యాగం అందం!!!
                నాకు జన్మ నిచ్చేందుకై పంటిబిగువున పురిటినొప్పుల్ని ఓర్చిన...
                                         తన సహనం అందం!!!  

                        అందం !!! అందం!!!
                         అమ్మ ప్రేమ అందం!
                         అమ్మ కన్నెర్ర ఇంకా అందం!!

                         అమ్మ చేతి గోరుముద్ద అందం!
                         అమ్మ చేతిలో తిన్న దెబ్బలు ఇంకా అందం!!
                      
                          అమ్మ నాపై పెంచుకున్న ఇష్టం అందం!
                          అమ్మ నాకోసం పడ్డ కష్టాలు చాలా చాలా అందం!!

                          అమ్మ అందం!!! 
                          అమ్మతనమేంతో అందం!!!      
                          అమ్మ మనసెంతో అందం!!!
                                                                                            మన్ను.యస్                             

nee premalo...

నీ కాలి మునివేళ్ళ చల్లదనం తో...
        నా గుండె గడ్డకట్టుకుపోయింది!!!
నీ వెచ్చని ఊపిరి సెగలతో...
        నను బ్రతికించుకోవా ప్రియా!!!                  
మిగిలిన ఆ రెండో అర్ధభాగాన్ని కూడా నీలో కలుపుకోనేందుకై!!!  
                                                                             నీ  మన్ను