25, నవంబర్ 2009, బుధవారం

నేను

నేనెవరినని...
ఎవరికిఏమౌతానని...
ఇలాచాలాసార్లు ప్రశ్నించుకున్నాను నామదిని...
కనీసం అదైనా ఏదోనాడుసమధానమివ్వకపోతుందానని...
పాపం...
అదికూడాచేసిందిఎన్నో విఫలయత్నాలను!
చివరకు తేల్చింది దయచేసి తనను వదిలేయమని!!  
ఇంతకూ...
నేనెవరినని...
ఎవరికిఏమౌతానని...
ఈప్రశ్నను అసలు ఎవరిని అడగాలని...
విసిగి విసిగి వేసారి...
   చివరకు నన్ను నేనుగా ఆవిష్కరించుకొనేందుకు ఈచిన్న ప్రయత్నాన్ని ఆరంభించాను...  
నేను...
 శూన్యంలోకి చూస్తు పిచ్చిలెక్కలేవోవెసుకొని మురిసిపోయే...
                                                                 గణాంక కోవిదుడ్నినేను!!
 మహాభారత రామయణాలలో ఎదిగొప్పో నెగ్గుతెల్చేందుకు...
      మిత్రుడు రవికాంతునితో ఇష్టాగొష్టిలుజరిపిన పేద్ధ సాహితివెత్తను నేను !!
స్త్రీ స్వేచ్చాస్వాతంత్రాలను హరించే పురుషజత్యాహంకరం మీద...
             యాసిడ్ దాడులనుచెయ్యాలనుకొనే ఉన్మాదిని నేను!!
చర్చలకేమీ అందనపుడు ఆడదానికట్టూబొట్టుల గురించి...
             గంటలకొద్దీ విమర్శించే సగటు మగాడిని నేను!!

శంకర్ దాదా సినిమాను చూసి...
             కనీసం ఒక్క సెకెనైనా గాంధీలా బతకాలనుకొనే అసలైన గాంధేయవాదిని నేను!!
నేను ముస్లీం ననగానె ఇబ్బందిగాచూసిన చూపులకు ఎలా సమాధానమివ్వాలో తెలీక
 నిత్యం హనుమంతుడిగుడిముందు నా గుండెగోడునువెల్లిబుచ్చుకొనే భారతీయుడిని నేను!!
ఈప్రపంచాన ఆకలిదప్పులచావులనేవి వుండకూడదని...
      రొజులకొద్దీ ప్రణాళికలు వేసె స్వయంప్రాతిపత్తికా ప్రణాళికాసంఘన్ని నేను!!
కంప్యుటర్ యంత్రలముందు మొకరిల్లి...
     జీవితపు సున్నితత్వాన్ని కొల్పోతున్న యాంత్రికుడిని నేను!!
వారానికి మూణ్ణలుగుసార్లు కొళ్ళనుమేకలను నములుతూ...
     జీవహింస గురించి లెక్చర్లుదంచే గొప్ప అహింసావాదిని నేను!!
కలెక్టరునై  జనాన్నిఉద్ధరించడమె  నా జీవితలక్ష్యంగ చెసుకోని...
     మావూరి ఎమ్మర్వో గారి పైరాబడి గురించి ఆరాలుతీసే దీనజనోద్ధారకుడిని నేను!!  
మీటరు ఆటోల్లో, ఆఫీసు క్యాబుల్లో కూర్చోని...
      బస్సుల్లో ఫూట్ బొర్డింగ్ ఎంతప్రమదమోనని ఆలోచించే మేధావిని నేను!!
ఇంకా చెప్పలంటే... 
   కొన్నిసార్లు కవితలామారి...
           పిడిబాకుపదలతో విప్లవజ్యోతుల్ని వెలిగిస్తుంటాను!!
  మరికొన్నిసార్లెమో సమిధలా మారి...
           శ్రీశ్రిగారి కలలకు వారసుణ్ణై మురిసిపోతుంటాను!!
   ఇంకొన్నిసార్లైతే ఏకంగా ఉవ్వెత్తున ఎగిసేప్రవాహాన్నై...
           సామాజిక అసమనతలను రూపుమాపి సోషలిస్టు జలాలను నలుమూలలా ప్రవహింపచెస్తుంటాను!!
    ఇక ... ఎన్నో సార్లు పెనుతుఫానునై...
          పేదగొప్పతారతమ్యాలను పేకటివేళ్ళతో పెకిళించేస్తుంటాను!!
                                                                                                                            ----Mannu.S

7 కామెంట్‌లు:

  1. చాలా బాగు౦ది...మిమ్మల్ని మీరు చూసుకోవట౦ చాలా చాలా నచ్చి౦ది..నిజాయితిగా కన్పి౦చారు మీరు.అన్ని౦టిక౦టే నాకు మీరు మ౦చి,సరైన భారతీయుడిగా అన్పిస్తూన్నారు.
    ఇదే మొదటిసారి మీ బ్లాగ్ రావట౦ తృప్తిగా వేళ్ళుతున్నా...

    రిప్లయితొలగించండి
  2. చక్కగా రాసారు .. ఇది చాల మంది వారి వారికి అన్వయించుకోవచ్చు... ఇక మీ ఐఏఎస్ కి ఆల్ ది బెస్ట్

    రిప్లయితొలగించండి
  3. చాలా చాలా ధన్యవాదాలు సుభద్ర గారు... మీలాంటి వాళ్ళ మాటలు మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తాయి...

    రిప్లయితొలగించండి
  4. మీ అభిమానానికి , ఆశీస్సులకి చాలా థాంక్స్ శివగారు....

    రిప్లయితొలగించండి